వినియోగదారులకు సకాలంలో బొగ్గు సప్లై చేయాలి : ఎన్.బలరాంనాయక్​

 వినియోగదారులకు సకాలంలో బొగ్గు సప్లై చేయాలి : ఎన్.బలరాంనాయక్​
  •   సింగరేణి సీఎండీ ఎన్.బలరాంనాయక్​

కోల్​బెల్ట్/నస్పూర్, వెలుగు : సింగరేణి నుంచి ఉత్పత్తయే బొగ్గును సకాలంలో వినియోగదారులకు సప్లై చేయాలని సింగరేణి సీఎండీ ఎన్‌‌‌‌..బలరాంనాయక్‌‌‌‌ సూచించారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాలోని ఎస్సార్పీ ఓసీపీ, కళ్యాణిఖని ఓపెన్‌‌‌‌ కాస్ట్‌‌‌‌ మైన్లు, రామకృష్ణాపూర్‌‌‌‌ సింగరేణి ఏరియా హాస్పిటల్‌‌‌‌ను ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా జైపూర్‌‌‌‌ సింగరేణి థర్మల్‌‌‌‌ పవర్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌లో మొక్కలు నాటారు. అనంతరం ఓసీపీల్లో పనిస్థలాలు, బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, కోల్‌‌‌‌ బెంచ్‌‌‌‌లు, మైనింగ్‌‌‌‌ ప్లాన్స్‌‌‌‌, కార్మికులు, ఉద్యోగుల రక్షణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షణతో కూడిన ఉత్పత్తి, ఉత్పాదకత సాధన దిశగా సింగరేణి ముందుకు వెళ్తోందని, ఇదే విధానాన్ని కొనసాగిస్తూ టార్గెట్‌‌‌‌ను చేరుకుంటామని చెప్పారు. వినియోగదారులకు సరైన టైంలో బొగ్గు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బొగ్గు ఉత్పత్తిలో శ్రీరాంపూర్‌‌‌‌ ఓసీపీ సింగరేణికి తలమానికంగా ఉందన్నారు.

ఆయన వెంట మందమర్రి, శ్రీరాంపూర్​ఏరియా జీఎంలు జి.దేవేందర్, ఎల్‌‌‌‌వీ.సూర్యనారాయణ, ఎస్‌‌‌‌ఓ టు జీఎం విజయ్‌‌‌‌ప్రసాద్‌‌‌‌, ఓసీపీల పీవోలు మల్లయ్య, శ్రీనివాస్, సెక్యూరిటీ ఆఫీసర్లు రవికుమార్, జక్కారెడ్డి ఉన్నారు. అనంతరం రామకృష్ణాపూర్‌‌‌‌లోని సింగరేణి ఏరియా హాస్పిటల్‌‌‌‌కు చేరుకొని వార్డులను పరిశీలించి, రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే జైపూర్‌‌‌‌ మండలం పెగడపల్లి సింగరేణి థర్మల్‌‌‌‌ పవర్‌‌‌‌ప్లాంట్‌‌‌‌లోని ఖాళీ స్థలంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని చెప్పారు.