62 కొత్త చెరువుల నిర్మాణం, 40 చెరువుల్లో పూడికతీత.. మే 15 నాటికి పూర్తి చేయాలని సింగరేణి సీఎండీ ఆదేశం

62 కొత్త చెరువుల నిర్మాణం, 40 చెరువుల్లో పూడికతీత.. మే 15 నాటికి పూర్తి చేయాలని సింగరేణి సీఎండీ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: సింగరేణివ్యాప్తంగా 12 ఏరియాల్లో 62 కొత్త చెరువుల నిర్మాణం, 40 చెరువుల్లో పూడికతీత పనులు మే 15 కల్లా పూర్తిచేయాలని సింగరేణి సీఎండీ బలరామ్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సింగరేణి భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో అన్ని ఏరియాల జీఎంలకు, సంబంధిత పర్యావరణ, సివిల్ శాఖల అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. 

సింగరేణి ప్రాంతంలో భూగర్భ జలాల పెంపునకు ‘నీటి బిందువు జల సింధువు’ పేరుతో ఈ నెల ప్రారంభించిన మినీ చెరువుల నిర్మాణం కొనసాగుతోంది. ఇప్పటికే 20 శాతం పైగా పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. పనులు మరింత స్పీడప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని బలరామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదేశించారు. రానున్న వర్షాకాలంలో సింగరేణి నిర్మిస్తున్న ఈ చెరువుల్లో నీరు పుష్కలంగా చేరే విధంగా సివిల్ పనులు పూర్తి చేయాలన్నారు. మినీ చెరువుల చుట్టూ కంచెలు ఏర్పాటు చేయాలని సూచించారు.