సరికొత్త రికార్డులను నమోదు చేసిన సింగరేణి

సరికొత్త రికార్డులను నమోదు చేసిన సింగరేణి
  • సంస్థ చరిత్రలోనే అత్యధికంగా రూ.28,828 కోట్లు
  • 2018-19లో 21 శాతం వృద్ధి
  • కార్మికులు, అధికారులకు సీఎండీ శ్రీధర్ అభినందనలు

మందమర్రి, హైదరాబాద్ , వెలుగు: సింగరేణి కాలరీస్ 2018-19 ఏడాదిలో రికార్డు స్ధాయి వృద్ధి సాధించింది . సంస్థ చరిత్రలో తొలిసారిగా బొగ్గు ఉత్పత్తి, రవాణాలో 21 శాతం వృద్ధితో రూ.28,828 కోట్ల టర్నోవర్ సాధించి సరికొత్త రికార్డులను నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాల్లో 21శాతం, బొగ్గు రవాణాలో 5 శాతం, బొగ్గు ఉత్పత్తిలో4 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు సంస్థ సోమవారం తెలిపింది. సంస్థ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో టర్నోవర్, బొగ్గు రవాణా, ఉత్పత్తి సాధించటం ఇదే ప్రథమం. బొగ్గు రవాణాలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని దాటి 101 శాతంతో 676.73 లక్షల టన్నులబొగ్గును వివిధ పరిశ్రమలకు రవాణా చేసింది.

సంస్థ సాధించిన ప్రగతి పట్ల సీఎండీ శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. కార్మికులు, అధికారులు, సూపర్ వైజర్లకు, యూనియన్ నేతలకు అభినందనలు తెలిపారు. ఇదేవిధంగా కొత్త ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్నలక్ష్యాలు సాధిస్తూ ముందుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదే సమయంలో బొగ్గు రవాణాకు సహకరించిన రైల్వే శాఖకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 2018-19 ఏడాదిలో సింగరేణి సీఎండీ శ్రీధర్ కు అవుట్ స్టాండింగ్ గ్లోబల్ లీడర్ షిప్ అవార్డు, ఏషియా ఫసిపిక్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అవార్డు, ఎక్సలెన్స్ ఇన్ ఫెరాఫార్మెన్స్ అవార్డులు అందుకున్నారు. ఇక సంస్థకు ఇండియా బెస్ట్ కంపెనీ అవార్డు, ఏషియన్ మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీ, బెస్ట్ మేనేజ్ మెంట్, బెస్ట్ సేవా అవార్డులు అందాయి.