
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ 177 ఎక్స్‌టర్నల్ జూనియర్ అసిస్టెంట్ (గ్రేడ్-2) పోస్టుల భర్తీకి యాజమాన్యం ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జూన్ 20వ తేదీ నుంచి జులై 7వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.
అర్హతలు: డిగ్రీతోపాటు కంప్యూటర్స్, ఐటీ ఒక సబ్జెక్టుగా ఉండాలి, ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై కంప్యూటర్స్‌లో డిగ్రీ, డిప్లొమా లేదా ఆరు నెలల సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణులైన ఉన్న వారు అర్హులు. గరిష్ట వయసు 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అయిదేళ్ల సడలింపు ఉంటుంది.
రిజర్వేషన్: రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 95 శాతం ఉద్యోగాలను స్థానిక (ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల) అభ్యర్థులతో, మిగిలిన 5 శాతం పోస్టులను అన్‌రిజర్వుడు కోటా కింద(తెలంగాణలోని అన్ని జిల్లాల వారితో) భర్తీ చేస్తారు. దరఖాస్తులు జూన్ 20వ తేదీ నుంచి మొదలై జులై 7 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. పూర్తి సమాచారం కోసం www.scclmines.com వెబ్సైట్ సంప్రదించాలి.