భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : బొగ్గు నాణ్యతకు సింగరేణి అధిక ప్రాధాన్యత ఇస్తుందని సింగరేణి కాలరీస్ కంపెనీ డైరెక్టర్ఈ అండ్ ఎం సత్యనారాయణ అన్నారు. సింగరేణి కార్పొరేట్క్వాలిటీ డిపార్ట్మెంట్ఆఫీస్లో గురువారం నిర్వహించిన బొగ్గు నాణ్యతా వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 14 నుంచి 20 వరకు బొగ్గు నాణ్యతా వారోత్సవాలను సింగరేణి వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో తట్టుకోవాలంటే వినియోగదారులు అడిగిన విధంగా బొగ్గు క్వాలిటీతో సప్లై చేయాల్సిన అవసరం ఉందన్నారు. బొగ్గు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ ప్రోగ్రాంలో కార్పొరేట్క్వాలిటీ జీఎం రవి కుమార్, రీజనల్క్వాలిటీ జీఎం సుశాంతా సాహ, జీఎం స్టోర్స్ఎలిషా, ఎస్‌ఓటూ డైరెక్టర్ కేవీ రావు, డీజీఎం సీహెచ్ శ్రీనివాసరావు, అడిషనల్ మేనేజర్ వినోద్‌కుమార్ పాల్గొన్నారు.
డిజిటల్ రూపంలోనే అన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు..
సింగరేణిలో ఇక నుంచి ఉత్తర ప్రత్యుత్తరాలన్ని డిజిటల్ రూపంలోనే జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని సింగరేణి డైరెక్టర్లు జి. వెంకటేశ్వరరెడ్డి, డి. సత్యనారాయణ తెలిపారు. ఈ–ఆఫీస్ అమలుపై పలు శాఖల ఆఫీసర్లతో సింగరేణి హెడ్డాఫీస్ నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో వారు మాట్లాడారు. ఫైల్లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్అప్లికేషన్స్ను సింగరేణిలో అమలు పర్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.
ఇకపై రోజు వారీ చేసే లెటర్స్, నోట్స్, ఇతర డాక్యుమెంట్లను పైపర్‌పై కాకుండా ఈ ఆఫీస్ ద్వారా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ప్రోగ్రాంలో ఈఆర్పీ ప్రాజెక్ట్ మేనేజర్ హరప్రసాద్, జీఎంలు ఎం. సుబ్బారావు, దామోదర్‌రావు, నారాయణరావు, కే, ప్రసాదరావు, ఎలిసా, బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.