సింగరేణిలో మైన్స్ బ్లాస్టింగ్​కు.. ఎలక్ట్రానిక్​ డిటొనేటర్లు

సింగరేణిలో మైన్స్ బ్లాస్టింగ్​కు.. ఎలక్ట్రానిక్​ డిటొనేటర్లు
  • దేశంలోనే తొలిసారిగా ఓసీపీ --–-3లో వినియోగం 
  • మస్ట్,గా వాడాలంటూ ఆదేశించిన కేంద్ర హోంశాఖ  
  • వచ్చే జనవరి నుంచి పూర్తిస్థాయిలో అమలు 
  • మావోయిస్టుల బ్లాస్టింగ్ చర్యల కట్టడి కోసమేనా?

గోదావరిఖని, వెలుగు : సింగరేణి సంస్థ ఓపెన్​కాస్ట్​ ప్రాజెక్ట్​లు, అండర్​గ్రౌండ్​మైన్స్​లో బొగ్గు, మట్టి వెలికితీతకు కొత్త టెక్నాలజీని వాడనుంది. ఇప్పటివరకు ఎలక్ట్రికల్​డిటొనేటర్లను వాడుతుంది. సెంట్రల్ హోం మినిస్ట్రీ ఆదేశాలతో ఇకముందు ఎలక్ట్రానిక్​డిటొనేటర్లను వినియోగించనుంది. కొద్ది రోజుల కింద తొలిసారిగా వీటిని రామగుండం రీజియన్​పరిధి ఓపెన్​ కాస్ట్​– 3 ప్రాజెక్ట్​లో వినియోగించి అధికారులు సక్సెస్​అయ్యారు.  వచ్చే జనవరి నుంచి మిగతా అన్ని ఓపెన్​కాస్ట్​ప్రాజెక్ట్​ల్లోనూ పూర్తిస్థాయిలో అమలు చేస్తారు. 

 బొగ్గు లేదా మట్టి తొలగింపునకు బ్లాస్టింగ్ 

 ఓపెన్​కాస్ట్​ప్రాజెక్ట్ ల్లో బొగ్గు లేదా దానిపైన ఉన్న మట్టిని తొలగించేందుకు ఏరియాను బట్టి ఒకేసారి 50 –100 వరకు హోల్స్ పెట్టి.. వాటిల్లో పేలుడు పదార్థాన్ని నింపి ట్రక్కుల్లో తీసుకొచ్చిన లిక్విడ్​ను పోస్తారు.  ఇక అన్ని హోల్స్​తో నానెల్స్​కు ఎలక్ట్రికల్​డిటొనేటర్​ను అనుసంధానించి బ్యాటరీ, లేదంటే కరెంట్​తో కనెక్షన్ ఇచ్చి బ్లాస్టింగ్​చేసేవారు. దీంతో మట్టి లేదా బొగ్గు వదులుగా మారుతుంది. తదనంతరం షావెల్స్​తో దాన్ని తొలగించి నిర్దేశించిన ప్రాంతానికి డంపర్​వెహికల్స్​ద్వారా సరఫరా చేస్తుంటారు. 

Also Read :- ఓసీ వర్సెస్ బీసీ

మావోయిస్టుల చర్యల నియంత్రణకేనా?

దేశంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లపై నిత్యం బ్లాస్టింగ్​లు జరిగి చాలామంది ప్రాణాలు కోల్పోతుండడం, తీవ్రంగా గాయాలు అవుతున్న ఘటనలు చూస్తున్నాం. ఎలక్ట్రికల్​డిటొనేటర్లను రోడ్డు మధ్యలో భూమిలో పాతిపెట్టి దూరంగా వెళ్లి వైర్లను కలిపి పేల్చడం ఈజీగా ఉంటుంది. ఇకముందు ఎలక్ట్రికల్​డిటొనేటర్ల తయారీని పూర్తిగా నిలిపివేయాలనే నిర్ణయానికి కేంద్ర హోంశాఖ వచ్చినట్టు తెలుస్తుంది. ప్రత్యేక కోడ్​తో లాగర్​తో ఎలక్ట్రానిక్​డిటొనేటర్లను బ్లాస్టింగ్​చేయడం ద్వారా కోల్, సున్నపురాయి, ఇతర సంస్థల్లో మాత్రమే బ్లాస్టింగ్ కు వినియోగించే వీలుంటుంది. ఇవి ఎవరి చేతిలోకైనా వెళ్లినా కోడ్​లేకపోతే బ్లాస్టింగ్​చేయడం కుదరదు. ఇలాంటివాటితో మావోయిస్టుల బ్లాస్టింగ్​చర్యలను కట్టడి చేసేందుకే  కేంద్ర హోంశాఖ వీటి వాడకం, అమలుపై దృష్టి సారించినట్టు కనిపిస్తుంది. 

ప్రత్యేక కోడ్ ​నంబర్ ద్వారా

 ఇక నుంచి ఎలక్ట్రానిక్​ డిటొనేటర్లను మస్ట్ గా వినియోగించేలా సింగరేణి మేనేజ్​మెంట్​చర్యలు చేపట్టింది. వీటికి బ్యాటరీ, కరెంట్​ద్వారా కాకుండా ప్రత్యేకమైన కోడ్​నంబర్ లాగర్​లో నమోదు చేసి కనెక్షన్​ఇచ్చి అనంతరం బ్లాస్టింగ్​చేస్తారు. ఇది ఎలక్ట్రానిక్​ డిటొనేటర్​పేల్చినంత ఈజీగా ఉండదు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఎలక్ట్రికల్​డిటొనేటర్లను పూర్తిస్థాయిలో బంద్​పెడతారు.  

 డీజీఎంఎస్​ అనుమతి ఇస్తే..

అండర్​గ్రౌండ్​ మైన్లలో కూడా బొగ్గును వెలికితీసేందుకు బ్లాస్టింగ్​కు ఎలక్ట్రానిక్​ డిటొనేటర్లను వాడేందుకు మేనేజ్​మెంట్ డైరెక్టర్​జనరల్​ఆఫ్ మైన్స్​సేఫ్టీ(డీజీఎంఎస్​) ఆఫీసర్లతో చర్చలు జరుపుతుంది. అండర్ గ్రౌండ్ గనుల్లో బొగ్గు కోసం హోల్స్​చేస్తే ప్రతి హోల్​లో ఎలక్ట్రానిక్​ డిటొనేటర్​ను పెట్టి అందులో మట్టితో కూడిన గుట్కాను చేర్చి పేల్చుతారు. ఓపెన్​ కాస్ట్​లతో పోల్చితే అండర్​గ్రౌండ్​ మైన్లలో డిటనేటర్ల వాడకం ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఎలక్ట్రానిక్​ డిటొనేటర్లను వాడకంపై డీజీఎంఎస్​ అనుమతి కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. 

టెండర్లలో సింగరేణి ముందు

దేశంలో 80 శాతానికి పైగా బొగ్గు ఉత్పత్తి కోల్​ఇండియా నుంచే వస్తుంది. వివిధ రాష్ట్రాల్లోని బొగ్గు సంస్థలతో కూడిన కోల్​ ఇండియా సంస్థ పరిధిలోని ఓపెన్​ కాస్ట్​ల్లో ఎలక్ట్రానిక్​ డిటొనేటర్లను ఇప్పటివరకు వాడలేదు. ప్రస్తుతం వాటి తయారీ కంపెనీల నుంచి టెండర్లను ఆహ్వానించారు. ఇందులో సింగరేణి సంస్థ అడ్వాన్స్​గా ఉంది.