నస్పూర్, వెలుగు: తమ వేతనాలు పెంచాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ జీఎం ఆఫీసు ముందు కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా చేపట్టారు. ఎస్వోటు జీఎంకు మెమోరాండం అందించి మాట్లాడారు. సింగరేణి వ్యాప్తంగా దాదాపు 30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని, వారికి ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో అమలు చేస్తున్న సెలవులు, లీవ్‌లు, కుటుంబాలకు ఉచిత వైద్యం, అలవెన్సులు ఇతరత్రాలను సింగరేణి యాజమాన్యం కూడా అమలు చేయలన్నారు.
11వ వేతన ఒప్పందంలో భాగంగా కోలిండియా వేతనా లను సింగరేణిలోని అన్ని డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ కార్మికులకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బ్రహ్మానందం, వెంకన్న, భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు టి.శ్రీనివాస్, అరుణోదయ రాష్ట్ర నాయకులు మంతెన మల్లన్న, శేఖర్, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.జ్యోతి, డి.అరుణ, పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్రీకాంత్, జి.మల్లేశ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.