సింగరేణి కాంట్రాక్టర్ల డైరీ ఆవిష్కరణ

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియా సింగరేణి సివిల్ కాంట్రాక్టర్స్, ఓనర్స్ అసోసియేషన్​ నూతన సంవత్సర డైరీని సోమవారం మందమర్రి ఏరియా సింగరేణి జీఎం మనోహర్​ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లు తమకు కేటాయించిన పనులను సకాలంలో పూర్తి చేయాలని, సమస్యలుంటే తన దృష్టికి తీసుకరావాలని సూచించారు. 

కార్యక్రమంలో ఏస్వోటు జీఎం రాజేశ్వర్​రెడ్డి, పర్సనల్​ మేనేజర్​ శ్యాంసుందర్, డీజీఎం సివిల్ ​శ్రీనివాసులు, డీజీఎం ఫైనాన్స్ ప్రసాద్, కాంట్రాక్టర్స్​ఓనర్స్​అసోసియేషన్​గౌరవ అధ్యక్షుడు పరంధాములు, ప్రెసిడెంట్​బర్ల నాగమల్లేశ్, జనరల్​ సెక్రటరీ బర్ల చంద్రశేఖర్, కోశాధికారి సీహెచ్​శ్రీనివాస్​ తదితరులు పాల్గొన్నారు.