- కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ప్రోగ్రామ్స్
- హాజరుకానున్న సింగరేణి సీఎండీ బలరాం
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి డే వేడుకలకు యాజమాన్యం భారీగా ఏర్పాట్లు చేసింది. రేపు సింగరేణివ్యాప్తంగా అన్ని ఏరియాల్లో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించనుండ గా.. ఇందుకు సంస్థ రూ. 45లక్షలు మంజూరు చేసింది. సెలబ్రేషన్స్‌కు కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియం ముస్తాబైంది.
దీనికి కంపెనీ సీఎండీ ఎన్. బలరాం హాజరవుతారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో విస్తరించిన సింగరేణి కాలరీస్కంపెనీకి 136 ఏండ్ల చరిత్ర ఉంది. ప్రతి ఏటా డిసెంబర్ 23న సింగరేణి డే వేడుకలను సంస్థ నిర్వహిస్తుంది. కంపెనీ ప్రగతి, సంక్షేమంపై పలు స్టాల్స్‌ను ఆఫీసర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి వేడుకుల్లో సినీ గాయకులు, కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు.