
కోల్ బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియా కల్యాణిఖని ఓపెన్‌కాస్ట్ మైన్‌ను సింగరేణి డైరెక్టర్(ప్లానింగ్, ప్రాజెక్ట్, పా) కె.వెంకటేశ్వర్లు ఆదివారం సందర్శించారు. ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, ఓవర్‌బర్డెన్ వెలికితీత పనులను తనిఖీ చేశారు. అనంతరం నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో పాల్గొని మాట్లాడుతూ.. బొగ్గు ఉత్పత్తి లక్ష్యసాధనకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ను ఘనంగా సన్మానించారు.
మందమర్రి ఏరియా జీఎం జి.దేవేందర్, బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జీఎం రఘుకుమార్, ఏరియా ఎస్వోటుజీఎం ఎం.విజయప్రసాద్, కేకే ఓసీపీ పీవో మల్లయ్య, కేకే గ్రూప్ఏజెంట్రాంబాబు, ఏరియా ఇంజనీర్ వెంకటరమణ, సేఫ్టీ ఆఫీసర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.