
జైపూర్, వెలుగు: 40 నెలల్లో మూడో ప్లాంట్ పనులు పూర్తవ్వాలని సింగరేణి డైరెక్టర్(ఈఅండ్ఎం) సత్యనారాయణరావు ఆదేశించారు. శుక్రవారం సింగరేణి డైరెక్టర్ ఎస్టీపీపీ గెస్ట్ హౌస్ లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమావేశమై, పలు సూచనలు చేశారు. అనంతరం ఓపెన్ ఆడిటోరియంలో 54వ జాతీయ భద్రత వారోత్సవాల ముగింపు వేడుకలకు హాజరై, మాట్లాడారు. గత ప్రమాదాలపై అవగాహనతో ఉండి, ప్రస్తుతం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సేఫ్టీ స్లోగన్, సేఫ్టీ డ్రాయింగ్, ఎస్సే రైటింగ్ పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గోపాల్ రావు, ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి, జీఎం శ్రీనివాసులు, ఏజీఎంలు మురళీధర్, మదన్ మోహన్, అజాజుల్ఖాన్, సీఎంవోఏఐ బ్రాంచ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.