- కాంగ్రెస్ లోకి సింగరేణి డాక్టర్
మంచిర్యాల, వెలుగు: సింగరేణి డాక్టర్ రాజారమేశ్ వచ్చే ఎన్నికల్లో చెన్నూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెంట మొన్న ఢిల్లీ వెళ్లిన ఆయన జులై 2న కాంగ్రెస్ లో చేరనున్నారు. బెల్లంపల్లికి చెందిన రాజారమేశ్సింగరేణి డాక్టర్‌గా ఈ ప్రాంతంలో సుపరిచితులు. గతంలో చాలాకాలం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పనిచేశారు. అప్పుడు ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి దగ్గరయ్యారు. తర్వాత జిల్లాలోని రామకృష్ణాపూర్ ఏరియా హాస్పిటల్‌కు బదిలీపై వచ్చారు. కొవిడ్టైమ్లో ఈ ప్రాంత కార్మికులకు విశేష సేవలు అందించారనే పేరుంది. ఈ ఎన్నికల్లో చెన్నూర్ నుంచి పోటీ చేయడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. తన సోదరి పేరిట జీఎస్సార్ ఫౌండేషన్ ను స్థాపించి నియోజకవర్గంలో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
రాజారమేశ్తనకు పోటీగా వస్తున్నాడని భావించిన ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆయనను ఐదు నెలల కిందట ఇల్లందుకు ట్రాన్స్ఫర్ చేయించాడనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో దీర్ఘకాలిక సెలవు పెట్టి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ద్వారా పొలిటికల్ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు పొంగులేటి వెంట కాంగ్రెస్‌లోకి వెళ్లనున్నారు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిరాజారమేశ్కు చెన్నూర్ టికెట్‌పై హామీ ఇచ్చినట్టు అనుచరులు చెబుతున్నారు. త్వరలోనే సింగరేణి ఉద్యోగానికి రిజైన్ చేసి పూర్తిస్థాయి పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని పేర్కొంటున్నారు.
పీఎస్సార్ గ్రూప్సహకరించేనా...?
డాక్టర్రాజారమేశ్చేరికతో చెన్నూర్ నియోజకవర్గ కాంగ్రెస్‌లో సమీకరణాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు అనుచరుడైన నూకల రమేశ్ చెన్నూర్నుంచి పోటీకి రెడీ అవుతున్నారు. కొంతకాలంగా నియోజకవర్గంలో ఇంటింటికి కాంగ్రెస్ పేరిట పాదయాత్ర చేస్తున్నారు. మంచిర్యాలకు చెందిన రియల్టర్ దుర్గం అశోక్ ఎప్పటినుంచో కాంగ్రెస్ టికెట్‌కోసం ట్రై చేస్తున్నారు. మరోవైపు బాల్క సుమన్ కు, పీఎస్సార్‌కు మధ్య సీక్రెట్అగ్రిమెంట్ ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే సుమన్‌తో విభేదించి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలును పొమ్మనలేక పొగపెట్టి వెనక్కు పంపించారనే ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలో రాజారమేశ్‌కు పీఎస్సార్గ్రూపు సహకరిస్తుందా? అన్న చర్చ మొదలైంది.