ప్రశాంతంగా కొనసాగుతున్న సింగరేణి ఎన్నికల పోలింగ్

సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ప్రశాతంగా కొనసాగుతుంది. అన్ని చోట్ల 28 శాతంపైగానే పోలింగ్ జరిగినట్లు తెలుస్తుంది. సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. 6 జిల్లాల పరిధిలో 11 ప్రాంతాల్లో 84 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. భూపాలపల్లిలోని పోలింగ్ కేంద్రాల్లో కార్మిక సంఘాల నేతులు, కార్యకర్తల మధ్య పోటాపోటీ నినాదాలు చేసుకుంటున్నారు. AITUC నేతలు రెడ్ షర్ట్ వేసుకురావడంపై ఇతర యూనియన్ల నేతలు అభ్యంతరం తెలిపారు. దీంతో ఇరు వర్గాలకు మధ్య వాగ్వాదం జరిగింది. 

మరోవైపు 618 మంది ఓటర్లున్న ...ఇల్లందు నుంచి తొలి ఫలితం రానుంది. 9 వేలకు పైగా ఓటర్లు ఉన్న శ్రీరాంపూర్ నుంచి తుది ఫలితం వస్తుంది. అధికార కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ INTUC, AITUC, CITU, BMS తో పాటు 13 సంఘాలు ఎన్నికల బరిలో ఉన్నాయి. అయితే INTUC, AITUC మధ్యే హోరాహోరీ పోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు యూనియన్లకు బలమైన క్యాడర్ ఉండడం, మాతృపార్టీల లీడర్లు ముమ్మర ప్రచారం నిర్వహించడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.