షెడ్యూల్​ ప్రకారం సింగరేణి ఎన్నికలు నిర్వహించాలి : వాసిరెడ్డి సీతారామయ్య

గోదావ‌‌‌‌‌‌‌‌రిఖ‌‌‌‌‌‌‌‌ని, వెలుగు: కేంద్ర కార్మిక శాఖ పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు సంఘం ఎన్నికల‌‌‌‌‌‌‌‌ను నిర్వహించాల‌‌‌‌‌‌‌‌ని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్​చేశారు. ఆదివారం గోదావరిఖని భాస్కరరావు భవన్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ఏఐటీయూసీ ఆర్జీ –1 బ్రాంచీ ముఖ్య కార్యకర్తల స‌‌‌‌‌‌‌‌మావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ‌‌‌‌‌‌‌‌ను వాయిదా వేసేందుకు ఇంధన శాఖ కోర్టును ఆశ్రయించడం వెనుక ఐఎన్టీయూసీ హస్తం ఉందని ఆరోపించారు.

కేసును వెంటనే ఉపంహ‌‌‌‌‌‌‌‌రించుకొని ఎన్నికలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్ల కింద జరగాల్సిన ఈ ఎన్నికల‌‌‌‌‌‌‌‌ను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారి లబ్ధికోసం వాయిదా వేసిందని ఆరోపించారు. సమావేశంలో  సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య, ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి స్వామి, బ్రాంచి కార్యదర్శి ఆరేల్లి పోశం, నాయకులు పాల్గొన్నారు.