ముగిసిన సింగరేణి ఎన్నికలు.. ఫలితాలపై ఉత్కంఠ

తెలంగాణ రాష్ట్రంలో బుధవారం (డిసెంబర్ 27న) సింగరేణి సంస్థలో నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభంకానుంది. బుధవారం రాత్రే ఫలితాలను కూడా అధికారులు వెల్లడించనున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు 90 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు చెప్పారు. 

* తక్కువ ఓట్లు (618 ఓట్లు) ఉన్న ఇల్లందు ప్రాంతం నుంచే తొలి ఫలితం వెల్లడికానుంది. ఇక చివరగా 9 వేలకు పైగా ఓటర్లు ఉన్న  శ్రీరాంపూర్ డివిజన్ నుంచి ఫలితం రానుంది.  

* 6 జిల్లాల పరిధిలో 11 ప్రాంతాల్లో 84 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరిగాయి.

* అధికార కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ INTUC, AITUC, CITU, BMS తో పాటు 13 సంఘాలు ఎన్నికల బరిలో ఉన్నాయి. 

* అధికార గుర్తింపు సంఘంగా విజేత ఎవరు కాబోతున్నారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.