డిసెంబర్ 27న సింగరేణి ఎన్నికలు.. బొగ్గు గనుల్లో ముగిసిన ప్రచారం

  • ఆరు జిల్లాల పరిధిలో 11 డివిజన్లు
  • ఓటెయ్యనున్న 39,773 మంది కార్మికులు
  • ఐడెంటిటీ కార్డు ఉంటేనే పోలింగ్ సెంటర్లోకి
  • అదే రోజు రాత్రి 7 గంటలకు కౌంటింగ్

గోదావరిఖని / కోల్‌‌బెల్ట్‌‌, వెలుగు: సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లలోని 84 పోలింగ్‌‌ బూత్‌‌లలో 39,773 మంది కార్మికులు తమ ఓటు హక్కు ను సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో వినియోగించుకోనున్నారు.  ఇన్నాళ్లు కార్మిక సంఘాలు గనులపై చేపట్టిన ప్రచారం సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. అధికార కాంగ్రెస్‌‌ పార్టీ అనుబంధ ఐఎన్‌‌టీయూసీతో పాటు ఏఐటీయూసీ, సీఐటీయూ, బీఎంఎస్‌‌, హెచ్‌‌ఎంఎస్‌‌, టీబీజీకేఎస్‌‌, ఇప్టూ, విప్లవ కార్మిక సంఘాలతో పాటు 13 సంఘాలు ఈ ఎన్నికల్లో పోటీపడ్తున్నాయి.

సింగరేణిలో గుర్తింపు ఎన్నికలు  ప్రారంభమైన 1998 నుంచి ఈ ఎన్నికల వరకు ఏకంగా 68, 439 మంది కార్మికులు(ఓటర్లు) తగ్గిపోయారు. 1998 ఎన్నికల టైమ్​లో 1,08,212 మంది కార్మికులుండగా, రెండోసారి ఎన్నికలు జరిగిన 2001లో 1,03,901 మంది కార్మికులు, మూడోసారి  ఎన్నికలు జరిగిన2003లో 94,549 మంది కార్మికులు, నాలుగోసారి ఎన్నికలు జరిగిన 2007లో 75,376 మంది కార్మికులు, ఐదోసారి ఎన్నికలు జరిగిన 2012లో 63,429 మంది కార్మికులు,ఆరోసారి ఎన్నికలు జరిగిన 2017లో 49,877 మంది కార్మికులు సింగరేణిలో పనిచేశారు. తాజాగా 2023లో ఏడో దఫా జరుగుతున్న ఎన్నికల్లో 39,773 మంది కార్మికులు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు.

రంగంలోకి మంత్రులు, ఎమ్మెల్యేలు

కోర్టులో వేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఎన్నికలు జరుగుతాయా..? లేదా? అనే సందిగ్ధం చాన్నాళ్లు కొనసాగింది. హైకోర్టు తీర్పుతో తక్కువ సమయంలో పలు రకాల హామీలతో కార్మిక సంఘాలు తమ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సోమవారం సాయంత్రం ఐదు గంటలతో ప్రచారం ముగించాయి. ఏఐటీయూసీ, ఐఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీయూసీకి మధ్య పొత్తు ఉంటుందని భావించగా అది కుదరకపోవడంతో రెండు సంఘాలు వేర్వేరుగానే బరిలోకి దిగాయి. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనుబంధ ఐఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీయూసీ తరఫున కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బెల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాంతానికి చెందిన మంత్రులు శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి, గడ్డం వినోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఠాకూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గండ్ర సత్యనారాయణరెడ్డి, ఏఐటీయూసీ తరుపున కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఆ యూనియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్ర నేతలు ప్రచారం చేశారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆయా పట్టణాల్లో మోటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ర్యాలీలు నిర్వహించారు. చివరి రెండు రోజులైన సోమ, మంగళవారాలలో ఆత్మీయ సమావేశాల పేరుతో వివిధ కార్మికులకు విందు ఏర్పాట్లు చేశారు.

శ్రీరాంపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎక్కువ.. ఇల్లందులో తక్కువ

ఈ నెల 27న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో 11 డివిజన్లకు చెందిన కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. శ్రీరాంపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎక్కువ మంది, ఇల్లందులో తక్కవ మంది కార్మికులు ఓటు వేయనున్నారు. కొత్తగూడెం కార్పొరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగరేణి భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలిపి 1,191 మంది, కొత్తగూడెంలో 2,326 మంది, ఇల్లందులో 614 మంది, మణుగూరులో 2,450 మంది, రామగుండం 1లో 5,384 మంది, రామగుండం 2లో 3,556 మంది, రామగుండం 3లో 3,884 మంది, భూపాలపల్లిలో 5,410 మంది, బెల్లంపల్లిలో 996 మంది, మందమర్రిలో 4,835 మంది, శ్రీరాంపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 9,127 మంది కలిపి మొత్తం సింగరేణి వ్యాప్తంగా 23 అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 19 ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, జీఎం ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లలో పనిచేసే 39,773 మంది కార్మికులు ఓటు వేయనున్నారు.

గుర్తింపు కార్డు తప్పనిసరిగా తెచ్చుకోవాలి

సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. 11 డివిజన్లను మూడు రీజియన్లుగా విభజించి 13 మంది అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిటర్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లను కేటాయించాం. వీరి ఆధ్వర్యంలోనే పోలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు కౌంటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రక్రియ జరుగుతుంది. సింగరేణి వ్యాప్తంగా మొత్తం 84 పోలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేంద్రాలలో కార్మికులు ఓటు వేయనున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరగగా, నిర్దేశిత రీజియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వార్టర్లలో రాత్రి ఏడు గంటల నుంచి కౌంటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రక్రియ మొదలవుతుంది. రహస్య బ్యాలెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పద్ధతిలో జరగనున్న ఈ ఎన్నికల్లో పాల్గొనే కార్మికులు తప్పని సరిగా తమ ఐడెంటిటీ కార్డును వెంట తెచ్చుకోవాలి. లేకపోతే పోలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేంద్రాల్లోకి అనుమతించం. గని కార్మికులు తమ ఓటును స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చు.
‒ డి.శ్రీనివాసులు, రిటర్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డిప్యూటీ చీఫ్ లేబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)