
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లిలోని జీఎం ఆఫీస్ కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి బిడ్డ ఎక్స్టెన్షన్ఆఫీసర్పరీక్షలు సత్తా చాటింది. సింగరేణి కార్మికుడిగా పనిచేస్తున్న కారంపూడి శ్రీనివాస రాజు–కృష్ణవేణి దంపతులకు కొడుకు హర్షవర్ధన్, కూతురు సంహితరాజ్ ఉన్నారు. సంహితరాజ్ ఇటీవల విడుదలైన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్-1 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పరీక్షలో రాష్ట్రవ్యాప్తంగా 21వ ర్యాంకు, జోనల్ స్థాయిలో 4వ ర్యాంకు సాధించి ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికయ్యారు.
సంహిత గతేడాది వెలువడిన గ్రూప్-4 ఫలితాల్లో జూనియర్ అసిస్టెంట్‌గా ఎంపికై మైనారిటీ సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ కాలేజీలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉద్యోగం చేస్తూనే కష్టపడి చదివి ఈ ఉద్యోగం సాధించా నని తెలిపారు. కాగా ఈ కుటుంబంలో నలుగురు కూడా ప్రభుత్వ ఉద్యోగులే.. సంహితరాజ్ తండ్రి బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని బొగ్గు గనిలో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తుండగా, తల్లి బెల్లంపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఆమె అన్న హర్షవర్ధన్ శ్రీరాంపూర్‌లో అండర్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.