ఉద్రిక్తంగా మారిన సింగరేణి నిర్వాసితుల నిరసన

భద్రాద్రి  కొత్తగూడెం జిల్లా  ఇల్లందులో  సింగరేణి నిర్వాసితుల  నిరసన ఉద్రిక్తంగా  మారింది. ఇల్లందులోని  16 వ  వార్డులో సింగరేణి నిర్వాసితులు  తమకు  పునరావాస ప్యాకేజ్  రాలేదని అధికారులను అడ్డుకున్నారు.  ఇళ్లను ఖాళీ  చేయిస్తున్న సింగరేణి  ఉద్యోగులు, సిబ్బందిని  అడ్డుకోవడంతో  ఉద్రిక్త  పరిస్థితి  నెలకొంది. తమకు సరైన పరిహారం  ఇవ్వకుండా  ఇళ్లను ఖాళీ  చేయిస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నారు. ఘటనలో  ఓ మహిళ  తలకు తీవ్ర గాయమైంది.