
- మందమర్రి ఏరియా సింగరేణి జీఎం జి.దేవేందర్
కోల్ బెల్ట్, వెలుగు: సింగరేణి సంస్థలో ఉద్యోగం దక్కడం అదృష్టమని, సక్రమంగా డ్యూటీలు చేయకపోతే ఉద్యోగ భద్రతకు ముప్పు ఉంటుందని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం జి.దేవేందర్ అన్నారు. మంగళవారం మందమర్రి జీఎం ఆఫీస్లో మెడికల్ ఇన్వాలిడేషన్ డిపెండెంట్లకు కారుణ్య నియామకం ద్వారా జాయినింగ్ ఆర్డర్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏరియాలో కారుణ్య నియామకాల ద్వారా 1972 మంది యువతీ యువకులకు ఉద్యోగాలు ఇచ్చామన్నారు.
అనంతరం ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ చదువుతున్న కేకే ఓసీపీ ఈపీ ఆపరేటర్ నూనె సాంబయ్య కూతుళ్లు నూనె పావని, జననీలకు మెరిట్ స్కాలర్షిప్ కింద రూ.20 వేలు అందజేశారు. కార్యక్రమంలో సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ మందమర్రి, బెల్లంపల్లి బ్రాంచి సెక్రటరీలు సలెంద్ర సత్యనారాయణ, దాగం మల్లేశ్, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, సింగరేణి ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమేశ్, డీవైపీఎం సత్యబోసు, ఓఎస్ రాజలింగు పాల్గొన్నారు.