రిటైర్మ్​మెంట్​ బెనిఫిట్స్​ త్వరగా అందించాలి : సింగరేణి జీఎం దీక్షితులు

రిటైర్మ్​మెంట్​ బెనిఫిట్స్​ త్వరగా అందించాలి : సింగరేణి జీఎం దీక్షితులు

నస్పూర్, వెలుగు: సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన అన్ని అంశాలను ఎప్పటికప్పుడు ఎంప్లాయ్ పర్సనల్ రికార్డులో పొందుపరచాలని సింగరేణి జనరల్​ మేనేజర్​(పర్సనల్, సెక్యురిటీ) దీక్షితులు సూచించారు. మంగళవారం శ్రీరాంపూర్​సింగరేణి జీఎం ఆఫీస్​లో బెల్లంపల్లి రీజియన్​ పరిధిలోని శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, ఎస్టీపీపీ ఏరియాల పర్సనల్ డిపార్ట్​మెంట్​ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..​ ఉద్యోగులకు రిటైర్మెంట్​తర్వాత అందించాల్సిన అన్ని సదుపాయాలను వీలైనంత త్వరగా వర్తింపజేయాల్సిన బాధ్యత పర్సనల్​ విభాగానిదేన్నారు. గైర్హాజరు ఉద్యోగులు, వారి ఫ్యామిలీకి కౌన్సెలింగ్​ నిర్వహిస్తూ డ్యూటీలకు హాజరయ్యేలా ప్రోత్సహించాలని కోరారు. 

సెక్యూరిటీ విభాగం కీలకం

సింగరేణి సంస్థ ఆస్తుల పరిరక్షణలో సెక్యూరిటీ విభాగం అధికారులు కీలకంగా వ్యవహరించాలని సింగరేణి  పర్సనల్​జీఎం దీక్షితులు, శ్రీరాంపూర్​ఏరియా ఇన్​చార్జి జీఎం టి.శ్రీనివాస్​అన్నారు. శ్రీరాంపూర్​ఏరియా సీసీసీ సింగరేణి గెస్ట్​హౌస్​లో  సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల సెక్యూరిటీ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించి మాట్లాడారు. సింగరేణి ఆస్తులు, గనులు, డిపార్ట్​మెంట్లు, ఓపెన్​కాస్ట్ మైన్లలో జరుగుతున్న అక్రమాలు, దొంగతనాలను అరికట్టాలన్నారు. 

బొగ్గు రవాణా చేసే క్రమంలో రైల్వే వ్యాగన్లు, టిప్పర్లు, లారీల్లో తనిఖీలు చేపట్టాలన్నారు. అనంతరం ఈ నెలాఖరున పదవీ విరమణ పొందనున్న దీక్షితులుతోపాటు బెల్లంపల్లి ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్​వరప్రసాద్​ను ఘనంగా సన్మానించారు. ఏరియా ఏస్వోటుజీఎం సత్యనారాయణ, పర్సనల్​డీజీఎంలు అజయ్ కుమార్(కార్పొరేట్), అరవిందరావు, వేణు మాధవ్ తదితరులు పాల్గొన్నారు.