- ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో పరిశీలన
కోల్బెల్ట్,వెలుగు: రామకృష్ణాపూర్ పట్టణ శివారులోని మూసివేసిన సింగరేణి టింబర్యార్డ్ ఎదుట ఉన్న స్థలాన్ని మంగళవారం మందమర్రి ఏరియా సింగరేణి జీఎం జి.దేవేందర్ పరిశీలించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో డంప్యార్డ్ కోసం 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇప్పటికే సింగరేణి యాజమాన్యాన్ని కోరారు.
ఎమ్మెల్యే ఆదేశాల నేపథ్యంలో జీఎం, ఎస్టేట్ ఆఫీసర్ వెంకటరెడ్డి తదితరులు ప్రతిపాదిత స్థలాన్ని చూశారు. శ్మశాన వాటిక కోసం కేటాయించే అవకాశం ఉన్న మరో 5 ఎకరాల స్థలాన్ని కూడా పరిశీలించారు. మైనింగ్ సర్వే అనంతరం డంప్ యార్డ్, శ్మశాన వాటికకు సింగరేణి యాజమాన్యం స్థలాలను కేటాయించే ఛాన్స్ఉంది. సింగరేణి ఎస్అండ్పీసీ సీనియర్ఇన్స్పెక్టర్ సుంకరి రమేశ్, జమేదార్ రాజయ్య పాల్గొన్నారు.