- సింగరేణి ఆధ్వర్యంలో 67.5 మెగావాట్ల ప్లాంట్
- బెల్లంపల్లి, మందమర్రిలో నాలుగు ప్రాంతాల్లో పనులు
- వాణిజ్య పరమైన అవసరాల కోసం లీజ్ భూముల వినియోగం
- రూ.340 కోట్ల వ్యయంతో ప్లాంట్ నిర్మాణం
కోల్‌బెల్ట్/బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సింగరేణి చర్యలు చేపట్టింది. కొత్తగా 67.5 మెగావాట్ల కెపాసిటీ సోలార్ పవర్ ప్లాంట్‌ను నిర్మించాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బెల్లంపల్లి, మందమర్రిలో ఐదు స్థలాలను గుర్తించిన మందమర్రి ఏరియా సింగరేణి యాజమాన్యం.. మూడు చోట్ల స్థలాలను చదును చేస్తోంది.
బొగ్గు గనులు మూతబడిపోయి, డిపార్ట్మెంట్ల ఎత్తివేతతో ఉనికి కోల్పోయిన బెల్లంపల్లిలో పెద్ద ఎత్తున బొగ్గు గనుల తవ్వకాలతోపాటు ఇతర అవసరాల కోసం ప్రభుత్వం నుంచి లీజ్‌కు తీసుకున్న వందలాది ఎకరాల భూములన్నాయి. ఖాళీగా ఉన్న భూములను కంపెనీ అవసరాలు, కమర్షియల్‌పరంగా వినియోగించాలనే టార్గెట్‌తో సోలార్ పవర్ ప్లాంట్‌ఏర్పాటుకు సింగరేణి శ్రీకారం చుట్టింది. ప్లాంట్ఏర్పాటుతో ఈ భూములు అన్యాక్రాంతం కాకుండా నియంత్రించే ఛాన్స్ కూడా ఉంటుందని సింగరేణి భావిస్తోంది.
పవర్ ప్లాంట్ ఇక్కడే..
మందమర్రి ఏరియా సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో కొత్తగా 67.5 మెగావాట్ సోలార్ పవర్‌ప్లాంట్‌ను బెల్లంపల్లి, మందమర్రిలోని నాలుగు ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు పనులు చేప
ట్టింది. బెల్లంపల్లిలో దశాబ్దాలుగా పడావుగా ఉంటున్న ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ హెడ్ క్వార్టర్ ముందు మ్యాగ్జిన్ ప్రాంతం, బుధా గెస్ట్హౌజ్ఆవరణలో, శాంతిఖని ఏజెంట్ ఆఫీస్ ప్రాంతంలో, మందమర్రిలోని షిర్కే పక్కన, మూసివేసిన కేకే 3, కేకే5 గనుల మధ్యలోని పాత ఆఫీస్ ఆవరణలో ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది.
కబ్జాకు గురికాకుండా..
బెల్లంపల్లిలోని మ్యాగ్జిన్, బుధా గెస్ట్హౌజ్ప్రాంతాల్లో సింగరేణికి వందలాది ఎకరాల భూములుండగా కొంత కబ్జాకు గురైంది. మందమర్రి ఏరియా సింగరేణి యాజమాన్యం ఇప్పటికే మందమర్రిలో ఎంవీటీసీ కేంద్రం వెనుక, రామకృష్ణాపూర్‌కు వెళ్లే మార్గంలోని ట్రినిటీ స్కూల్ఎదుట, కాసిపేట మండలం కాసీపేట 2 గని ప్రాంతాల్లో 43 మెగావాట్ల సోలార్‌పవర్ ప్లాంట్లను సక్సెస్పూల్గా నడుపుతోంది. ప్రభుత్వ కాలేజీ ముందున్న 28 మెగావాట్ల పవర్‌ప్లాంట్‌లో యాజమాన్యం ప్రతిష్ఠాత్మక బ్యాటరీ ఎనర్జీ సిస్టం ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల సింగరేణి సీఎండీ బలరాంనాయక్ ప్రకటించారు.
కొత్తగా ఏర్పాటు చేయనున్న సోలార్పవర్ప్లాంట్తో స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా దక్కనున్నాయి. బొగ్గు గనులు, డిపార్ట్మెంట్ల మూసివేతతో బోసిపోయిన బెల్లంపల్లిలో రెండు దశాబ్దాలుగా సింగరేణి ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. ఈ పవర్ప్లాంట్ఏర్పాటుతో ఇక్కడ తిరిగి సింగరేణి కార్యకలాపాలు మొదలయ్యే అవకాశాలున్నాయి.
రూ.340 కోట్ల వ్యయం నిర్మిస్తున్నాం
ఒక మెగావాట్‌కు ఐదెకరాల చొప్పున 67.5 మెగావాట్ల సోలార్ పవర్‌ప్లాంట్‌ను రూ.340 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నాం. మూడు నెలల్లో ప్లాంట్‌ను అందుబాటులోకి తీసుకొస్తాం. ఈ ప్లాంట్కోసం 350 నుంచి 400 ఎకరాల స్థలాలను సేకరిస్తున్నాం. సింగరేణి జీఎం జి.దేవేందర్, మందమర్రి ఏరియా