మందమర్రి సింగరేణి స్కూల్​లో ఆడ్మిషన్లకు ఆహ్వానం

మందమర్రి సింగరేణి స్కూల్​లో ఆడ్మిషన్లకు ఆహ్వానం

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రిలోని సింగరేణి హైస్కూల్​లో 2025–26 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల కోసం అడ్మిషన్లు ప్రారంభమయ్యాని కరస్పాండెంట్, ఏరియా సింగరేణి పర్సనల్​మేనేజర్​ఎస్.శ్యాంసుందర్, స్కూల్​హెచ్​ఎం జె.పురుషోత్తం గురువారం తెలిపారు. జూన్​30 వరకు ఆడ్మిషన్లు జరుగుతాయన్నారు. 

మందమర్రి ఏరియా సింగరేణి ఉద్యోగులు, నిర్వాసిత ప్రాంతాల ప్రజల పిల్లలు స్కూల్​లో చేరేందుకు అవకాశం ఉందని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్కూల్​లో నేరుగా ఆడ్మిషన్లు పొందవచ్చన్నారు.