హైదరాబాద్, వెలుగు: బొగ్గు ఉత్పత్తిలో సిం గరేణి చరిత్ర సృష్టించింది. ఒకే రోజు అత్యధికంగా 2.24 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. 2.35 లక్షల టన్నుల బొగ్గును డిస్పాచ్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. సింగరేణి సరికొత్త రికార్డుపై సంస్థ సీఎండీ శ్రీధర్ స్పందించారు.
సింగరేణి కార్మికులకు, ఉద్యోగులకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని కోరారు.