
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణిలోని 11 ఏరియాల్లో ఈ నెల 26 నుంచి సమ్మర్ క్యాంపులను నిర్వహించనున్నట్లు కంపెనీ జీఎం(పర్సనల్) కవితా నాయుడు పేర్కొన్నారు. కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీసులో శుక్రవారం ఆమె మీడియాకు వివరాలు వెల్లడించారు. 18 ఏండ్లలోపు వయసున్న బాలబాలికలు సమ్మర్క్యాంపులో పాల్గొనేందుకు అర్హులని పేర్కొన్నారు.
ఈ నెల 26 నుంచి వచ్చే నెల 20వరకు ఈ క్యాంపులు కొనసాగుతాయని తెలిపారు. కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లోని వారికి ప్రకాశం స్టేడియంలో బాస్కెట్ బాల్, అథ్లెటిక్స్, బాక్సింగ్, ఫుట్‌బాల్, వాలీబాల్, ఉషూ, కరాటే, డ్రాయింగ్‌లలో శిక్షణ ఉంటుందని తెలిపారు.