కోల్‌బెల్ట్, వెలుగు: మందమర్రి సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో రెండు రోజులు నిర్వహించిన సింగరేణి కంపెనీ లెవల్ఫుట్బాల్ పోటీలు బుధవారం ముగిశాయి. ఫైనల్పోటీల్లో శ్రీరాంపూర్ ఏరియా జట్టు విన్నర్‌గా నిలిచింది. సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల నుంచి జట్లు పాల్గొన్నాయి. శ్రీరాంపూర్ ఏరియా జట్టు క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబర్చి ప్రత్యర్థి జట్లను ఓడించారు.
విన్నర్శ్రీరాంపూర్, రన్నర్ రామగుండం1,2 ఏరియా జట్లకు మందమర్రి ఏరియా సింగరేణి పర్సనల్ మేనేజర్శ్యాంసుందర్, ఏఐటీయూసీ కేంద్ర కమిటీ సెక్రటరీ ఎండీ. అక్బర్అలీ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సింగరేణి ఆఫీసర్స్అసోసియేషన్ ప్రెసిడెంట్ రమేశ్, వర్క్ పీపుల్ స్పోర్ట్స్అండ్గేమ్స్అసోసియేషన్హానరబుల్సెక్రటరీ కార్తీక్, స్పోర్ట్స్సూపర్వైజర్లు పాస్నెట్, జాన్‌వెస్లీ, సీహెచ్.అశోక్, హెచ్.రమేశ్, పి.శ్రీనివాస్, నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.