సింగరేణిలో బీసీ లైజన్ ​ఆఫీసర్లు

సింగరేణిలో బీసీ లైజన్ ​ఆఫీసర్లు
  • సంస్థ చరిత్రలోనే తొలిసారిగా నియామకం
  • ఉత్తర్వులు జారీ చేసిన యాజమాన్యం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగ రేణి చరిత్రలోనే తొలిసారిగా బీసీ లైజన్​ ఆఫీసర్ల నియామకాలకు మేనేజ్ మెంట్ శ్రీకారం చుట్టింది. ఏరియాల వారీగా బీసీ లైజన్​ఆఫీసర్ల నియామక ఉత్తర్వులను మంగళవారం జారీ చేసింది. కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా బీసీ లైజన్​ఆఫీసర్​గా ఎస్వోఎంవి. 

మురళి, కొత్తగూడెం ఏరియాలో ఎస్ఈ అవదూత శ్రీధర్, ఇల్లెందు ఏరియాలో ఈఈ జి. నాగశేషు, మణుగూరులో డీజీఎం పి. వీరభద్రారావు, ఆర్జీ–1 ఏరియాలో అడిషనల్​మేనేజర్​ పి. శ్రీనివాస్, ఆర్జీ–2 ఏరియాలో ఎస్ఈ పి. వేణుగోపాల్, ఆర్జీ–3 ఏరియాలో డీజీఎం కె. చంద్రశేఖర్​, భూపాలపల్లి ఏరియాలో డీవైఎస్ఈ పి. బాలరాజు, బెల్లంపల్లి ఏరియాలో డీవై సీఎంఓ ఎం. మధుకుమార్​, మందమర్రి ఏరియాలో అడిషనల్​మేనేజర్​ఎండీ, ముస్తాఫా, శ్రీరాంపూర్​ ఏరియాలో డీజీఎం ఎన్​. సత్యనారాయణను బీసీ లైజన్​ ఆఫీసర్లుగా సింగరేణి నియమించింది.