
కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియా పరిధిలో ఆఫీస్ అటెండెంట్ (టీఅండ్ఎస్- గ్రేడ్హెచ్), రికార్డ్ అసిస్టెంట్(టీఅండ్ఎస్-గ్రేడ్ఈ) ఇంటర్నల్ఉద్యోగాలకు అర్హులైన వారికి సింగరేణి యాజమాన్యం మంగళవారం ఇంటర్వ్యూలు నిర్వహించింది.
జీఎం ఆఫీస్ కాన్ఫరెన్స్హాల్లో సెలక్షన్ కమిటీ మెంబర్స్ ఎస్ఓటు జీఎం ఎ. రాజేశ్వర్రెడ్డి, డీజీఎం రాజన్న(ఐఈడీ), పర్సనల్ మేనేజర్ ఎస్.శ్యాంసుందర్, డీవైపీఎం సత్యబోస్ సమక్షంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు.