రాంజీగోండు వనవాసి స్కూల్‌కు సింగరేణి విరాళం

రాంజీగోండు వనవాసి స్కూల్‌కు సింగరేణి విరాళం
  • రూ.3,34 లక్షల చెక్కు అందజేసిన సింగరేణి జీఎం

కోల్​బెల్ట్​, వెలుగు: ​బెల్లంపల్లిలోని రాంజీగోడు విద్యార్థి నిలయ వనవాసి కళ్యాణ పరిషత్​కు మందమర్రి ఏరియా సింగరేణి యాజమాన్యం రూ.3,34 లక్షల  సీఎస్‌ఆర్​నిధులను అందజేసింది.  శుక్రవారం స్కూల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మందమర్రి ఏరియా సింగరేణి జీఎం జి. దేవేందర్​ చెక్కును పాఠశాల కోశాధికారి లక్ష్మణ్‌కు అందజేశారు.  ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ..  విద్యార్థులకు మంచి చదువుతో పాటు ఆరోగ్యం, నాణ్యమైన భోజనం అందించాలన్నారు.  

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు.  అనాథ పిల్లలను చేరదీసి విద్యను అందిస్తున్న నిర్వాహకులను జీఎం అభినందించారు.  సింగరేణి సంస్థ సహకారం ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు.  కార్యక్రమంలో ఏరియా సింగరేణి పర్సనల్​ మేనేజర్​శ్యాంసుందర్,  సేవ, కమ్యూనికేషన్​ సెల్​కోఆర్డినేటర్​ఆఫీసర్​ ఎండి. ఆసిఫ్​ తదితరులు పాల్గొన్నారు.