అవినీతికి అడ్రస్​గా సింగరేణి మెడికల్​ బోర్డు

అవినీతికి అడ్రస్​గా సింగరేణి మెడికల్​ బోర్డు
  • వర్కర్స్​ యూనియన్​ ప్రెసిడెంట్​ సీతారామయ్య 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణి మెడికల్​ బోర్డు అవినీతికి కేరాఫ్​ అడ్రస్​గా మారిందని సింగరేణి కాలరీస్​ వర్కర్స్​యూనియన్​సెంట్రల్​కమిటీ ప్రెసిడెంట్​వాసిరెడ్డి సీతారామయ్య, జనరల్​సెక్రెటరీ రాజ్​కుమార్​అన్నారు. కొత్తగూడెంలోని శేషగిరిభవన్‌‌‌‌ లో శుక్రవారం యూనియన్​ సెంట్రల్​ కమిటీ మీటింగ్​ జరిగింది. అనంతరం విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ..  సింగరేణి చీఫ్​ మెడికల్​ఆఫీసర్ పోస్టు కోసం రూ. 2 కోట్లు ఖర్చు పెట్టారనే ప్రచారం సంస్థలో జోరుగా వినిపిస్తోందన్నారు.

కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్​హాస్పిటల్​నుంచి హెడ్డాఫీస్​, సింగరేణి భవన వరకు పలువురికి మెడికల్​బోర్డులో అక్రమాల్లో భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. సింగరేణిలో క్వాలిటీ వైద్యం అందని ద్రాక్షగా మారిందన్నారు. ఈ సమావేశంలో యూనియన్​ నేతలు మిర్యాల రంగయ్య, కె. సారయ్య, వంగా వెంకట్​, రాంగోపాల్​, గట్టయ్య, రమణమూర్తి, కిష్టఫర్​, రాములు పాల్గొన్నారు.