ఇన్సెంటివ్ వర్తింపులో సింగరేణి నిర్లక్ష్యం

కోల్​బెల్ట్​, వెలుగు: కార్మికులకు ఇన్సెంటివ్​ ఇవ్వడంలో సింగరేణి నిర్లక్ష్యం చేస్తుందని  గుర్తింపు సంఘం ఏఐటీయూసీ కార్పొరేట్​ చర్చల ప్రతినిధి సలెంద్ర సత్యనారాయణ అన్నారు.  మంగళవారం మందమర్రి ఏరియా సింగరేణి వర్క్​షాప్​లో ఏఐటీయూసీ ప్రతినిధుల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా కార్మికులు,ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా  సలెంద్ర సత్యనారాయణ మాట్లాడుతూ..  బొగ్గు గనుల్లో రక్షణ కోసం ఉపయోగించే ఐరన్​ సపోర్ట్​ దిమ్మెలను తయారు చేస్తున్న ఫ్యాబ్రికేషన్​ విభాగం ఉద్యోగులకు యాజమాన్యం ఇన్సెంటివ్ ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు.   సత్వరమే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఏరియా వర్క్​షాప్​ డీజీఎం నాయక్​ దృష్టికి తీసుకవెళ్లారు.  ఏఐటీయూసీ బ్రాంచి వైస్​ ప్రెసిడెంట్ భీమనాథుని సుదర్శనం,  వర్క్​మెన్​ ఇన్స్​పెక్టర్​ ముల్కలపల్లి వెంకటేశ్వర్లు, పెద్దపల్లి బాణయ్య, టేకుమట్ల తిరుపతి, అసిస్టెంట్​ పిట్​ సెక్రటరీ పారిపెల్లి రాజేశం, తదితరులు పాల్గొన్నారు.