- ఏడు నెలల్లో బొగ్గు ఉత్పత్తి 47 శాతమే
- ఆర్థిక సంవత్సరానికి మిగిలింది ఐదు నెలలే
- రోజుకు 2.40 లక్షల టన్నులు తీస్తేనే సాధ్యం
- ఏరియాల జీఎంలకు మేనేజ్మెంట్ ఆదేశాలు
గోదావరిఖని, వెలుగు : సింగరేణి సంస్థ 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో గత ఏప్రిల్ నుంచి అక్టోబర్వరకు సగం బొగ్గు కూడా తీయలేదు. ఇయర్లీ టార్గెట్72 మిలియన్ టన్నులు. కాగా ఏడు నెలల కాలంలో 47 శాతం బొగ్గు మాత్రమే వెలికితీశారు. మిగిలిన ఐదు నెలల్లో బొగ్గు ఉత్పత్తి మరింత స్పీడప్ చేస్తేనే టార్గెట్రీచ్అయ్యే చాన్స్ ఉంది. ఇందుకు రోజుకు 2.40 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సింగరేణి మేనేజ్మెంట్ఆదేశించింది.
17 ఓసీపీలు..22 అండర్ గ్రౌండ్ మైన్స్
సంస్థలో ప్రస్తుతం 17 ఓపెన్కాస్ట్ప్రాజెక్ట్లు, 22 అండర్ గ్రౌండ్ మైన్స్‌ల నుంచి బొగ్గును వెలికి తీస్తున్నారు. అండర్గ్రౌండ్మైన్లకు ఇయర్లీ టార్గెట్6.10 మిలియన్ టన్నులుగా నిర్ణయించారు. గత ఏప్రిల్ నుంచి అక్టోబర్వరకు 2.81 మిలియన్‌టన్నులు సాధించాయి. ఓపెన్కాస్ట్ప్రాజెక్ట్లకు 65.90 మిలియన్ టన్నులుగా టార్గెట్ గా పెట్టారు. ఏడు నెలల్లో 31.03 మిలియన్ టన్నులు మాత్రమే వెలికితీశారు. మొత్తంగా 72 మిలియన్‌టన్నుల టార్గెట్ లో 33.84 మిలియన్ టన్నులు వెలికి తీయగా.. ఇది 47 శాతం బొగ్గు ఉత్పత్తికి చేరుకుంది.
మెషీన్ల పనితీరు సరిగా లేకనేనా?
ఓపెన్కాస్ట్ప్రాజెక్ట్ల్లో సంస్థ డంపర్లు, షవల్స్, డోజర్లు, ఇతర వెహికల్స్ రోజులో మూడు షిఫ్ట్ లకు కేవలం 12 గంటలు మాత్రమే చేస్తున్నాయని ఇటీవల సంస్థ సీఎండీ ఎన్బలరామ్ స్వయంగా ప్రకటించారు. అండర్ గ్రౌండ్ మైన్లలో నడిచే సైడ్డంప్లోడర్(ఎస్ డీఎల్), లోడ్హాల్డంప్(ఎల్‌హెచ్ డీ) మెషీన్లు పూర్తి అధ్వానం గా మారడంతో రోజుకు కేవలం 7 గంటలు మాత్రమే నడుస్తున్నాయి. మెషీన్ల పనితీరుతోనే బొగ్గు ఉత్పత్తిలో వెనకబడుతున్నట్టు మేనేజ్మెంట్భావిస్తుంది.
పని గంటలు పెంచితేనే సాధ్యం
2024– -25 ఏడాదికి టార్గెట్‌కు ఇంకా ఐదు నెలలే మిగిలి ఉంది. ఇంకా 38.16 మిలియన్‌టన్నుల బొగ్గును వెలికితీయాలి. రోజుకు 2.40 మిలియన్టన్నులను ఓసీపీలు, అండర్గ్రౌండ్మైన్ల నుంచి ఉత్పత్తి చేయాలి. అండర్గ్రౌండ్మైన్లలో నడిచే ఏసీడీఎల్, ఎల్ హెచ్డీ మెషీన్లకు రోజుకు 12 గంటలు, ఓపెన్కాస్ట్ప్రాజెక్ట్ల్లో నడిచే డంపర్, షవల్వంటి భారీ మెషీన్లకు రోజుకు 20 గంటలు పని కల్పిస్తేనే టార్గెట్రీచ్అయ్యే చాన్స్ ఉంది. ఇందుకు సింగరేణిలోని అన్ని ఏరియాల జనరల్మేనేజర్లు బాధ్యత తీసుకోవాలని మేనేజ్మెంట్ ఆదేశాలు జారీ చేసింది.
ఉత్పత్తి పెరగకుంటే డేంజర్ లో సింగరేణి
బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత పెరగకపోతే భవిష్యత్ లో సంస్థ డేంజర్ లో పడుతుంది. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ ల్లో మెషీన్ల వాడకం తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. సంస్థకు లాభాలు బొగ్గు ఉత్పత్తి, అమ్మకం ద్వారా రావడంలేదు. విద్యుత్ ఉత్పత్తి, అమ్మకంతో పాటు డిపాజిట్ల వడ్డీతోనే సంస్థకు ఆదాయం వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రైవేటుకు దీటుగా ఉద్యోగులు మెషీన్ల పని గంటలను పెంచి బొగ్గును అధికంగా వెలికితీయాలి. ఇందుకు సంస్థ ఉద్యోగులు తమ పని తీరును మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– ఎన్. బలరామ్, సింగరేణి సీఎండీ