పేద స్టూడెంట్​కు రూ.72 వేల సాయం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఓ పేద మెడికల్​స్టూడెంట్​కు సింగరేణి ఆఫీసర్లు, కార్మికులు ఆర్థిక సాయం చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మపేటకు చెందిన గడ్డం శృతి ఖమ్మంలోని మమత మెడికల్​కాలేజీలో సెకండ్​ఇయర్​చదువుతోంది.

ఫీజు కట్టలేక చదువు ఆపే పరిస్థితి వచ్చిందని తెలుసుకున్న కొత్తగూడెం ఏరియా సింగరేణి ఆఫీసర్లు, కార్మికులు గురువారం రూ.72వేలు అందజేశారు. ఏరియా జీఎం షాలెం రాజు, ఎంవీటీసీ మేనేజర్​బీవీఎస్​ శర్మ, ఎస్​ఓటూ జీఎం జీవీ కోటిరెడ్డి, ఏజెంట్​బి.రవీందర్, పీవీకే–5 ఇంక్లైన్​మేనేజర్​ పాలడుగు శ్రీనివాస్, పర్సనల్​ మేనేజర్ బి.శివకేశవరావు, సెక్యూరిటీ ఆఫీసర్ రమణారెడ్డి పాల్గొన్నారు.