![సింగరేణి అధికారుల నిర్బంధం](https://static.v6velugu.com/uploads/2025/02/singareni-officials-arrested-by-khammam-district-sathupally-mandal-kistaram-village-people_2m9jJ4zOfZ.jpg)
- ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారంలో ఘటన
సత్తుపల్లి, వెలుగు : శైలో బంకర్ కాలుష్యం కారణంగా ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదంటూ ఓసీపీవో నరసింహారావు, సిబ్బందిని స్థానికులు నిర్బంధించిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సత్తుపల్లి మండలం కిష్టారం అంబేద్కర్ నగర్ కమ్యూనిటీ హాల్ కి కాలుష్యంపై విచారణ చేసేందుకు ఆదివారం అధికారులను వెళ్లారు.
స్థానిక కాలనీ వాసులు వెళ్లి అధికారులను నిర్బంధించడంతో ఒక్కసారిగా విస్తుపోయారు. వెంటనే అధికారులు వాహనాలను వదిలేసి పారిపోయారు. అనంతరం కాలనీ వాసులు మాట్లాడుతూ ఎన్ని సార్లు కాలుష్యంపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించకుంటే ఓసీలో పనులను కూడా అడ్డుకుంటామని హెచ్చరించారు.