భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ఓవైపు రాష్ట్రంలోని బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తున్న సింగరేణి.. మరోవైపు ఒడిశాలోని బంఖుయ్కోల్బ్లాక్ను దక్కించుకునేందుకు మంగళవారం కోల్మినిస్ట్రీ నిర్వహించిన వేలంలో పాల్గొంది. సింగరేణి సహా తమిళనాడులోని జెన్కో, ఒడిశాలోని ఎజ్గాని పవర్‌ప్లాంట్ సంస్థలు బిడ్స్ దాఖలు చేశాయి. బంఖుయ్ బ్లాక్‌లో దాదాపు 800 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నాయి. ఏడాదికి దాదాపు 10 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే ఒడిశాలోని నైని కోల్‌బ్లాక్‌ను సొంతం చేసుకున్న సింగరేణి.. దాని పక్కనే ఉన్న బంఖుయ్ బ్లాక్‌ను ఎలాగైనా దక్కించుకోవాలని ప్లాన్ చేసింది. అయితే టెండర్లలో పాల్గొన్న ఎజ్గాని పవర్‌ప్లాంట్ దాదాపు 11.25 శాతం ఎక్కువకు కోట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ బ్లాక్ సింగరేణి చేజారుతుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, పోయిన డిసెంబర్ లో మంచిర్యాలలోని కల్యాణిఖని బ్లాక్–6, శ్రావణపల్లి, భద్రాద్రిలోని కోయగూడెం బ్లాక్–3, ఖమ్మంలోని సత్తుపల్లి బ్లాక్–3 గనులను కోల్ మినిస్ట్రీ వేలం వేయగా.. సింగరేణి సంస్థ పాల్గొననేలేదు. కోయగూడెం, శ్రావణపల్లి బ్లాక్ లకు సింగిల్ బిడ్స్ రావడంతో ఆఫీసర్లు జనవరిలో మరోసారి టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకురాలేదు. ఇలా సొంత రాష్ట్రంలోని నాలుగు బ్లాక్‌లను పట్టించుకోని సింగరేణి.. ఒడిశాలోని గని కోసం పోటీపడడం గమనార్హం.
ఒడిశాలోని బొగ్గు గని కోసం సింగరేణి పోటీ
- తెలంగాణం
- February 9, 2022
లేటెస్ట్
- అదుపుతప్పి 8 పల్టీలు కొట్టిన కారు..కారులోని ఐదుగురూ సేఫ్
- కేజ్రీవాల్ విచారణకు ఈడీకి అనుమతిచ్చిన ఎల్జీ
- ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ డిజైన్ల పరిశీలన
- సిరిసిల్ల నేతన్నలకు మరో భరోసా
- పాక్‌లో టెర్రర్ అటాక్.. 16 మంది జవాన్ల మృతి
- పుస్తక పఠనంతో లోతైన విజ్ఞానం సాధ్యం
- అన్ని మతాల్ని సమానంగా చూస్తం
- బార్ అండ్ రెస్టారెంట్ ముసుగులో పబ్ నిర్వహణ
- ఒక్కో నియోజకవర్గానికి రూ.200 కోట్ల రుణమాఫీ నిధులు : ఎమ్మెల్యేరామ్మోహన్ రెడ్డి
- ప్రహరీ కూలి18 బైకులు ధ్వంసం
Most Read News
- Allu Arjun: కన్నీళ్లు పెట్టుకున్న అల్లు అర్జున్
- UI Box Office Collection Day 1: డీసెంట్ కలెక్షన్లు రాబట్టిన ఉపేంద్ర యూఐ.. హిట్ పడినట్లే..
- Good Health: బ్రౌన్ రైస్ తినడం అలవాటు చేసుకోండి.. జీవితంలో హాస్పిటల్ వైపు కూడా చూడరు..
- Christmas 2024 : మెదక్ కంటే పెద్ద చర్చి.. మన తెలంగాణలోనే మరొకటి ఉంది తెలుసా..!
- Gold Rates: గోల్డ్ ప్రియులకు షాక్.. వరుసగా మూడు రోజులు తగ్గి.. ఒక్కసారిగా పెరగిన బంగారం ధరలు
- Parenting Tips: పిల్లలకు ఇవి నేర్పండి చాలు.. జెమ్స్ అయిపోతారు..
- Rain alert: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఎప్పటి నుంచి అంటే..
- IND vs AUS: బాక్సింగ్ డే టెస్ట్ కల చెదిరింది.. స్క్వాడ్ నుంచి తప్పించడంపై మెక్‌స్వీనీ ఆవేదన
- గుడ్ న్యూస్..PF క్లెయిమ్ చాలా ఈజీ.. డ్రా చేసుకునేందుకు ‘ఈ -వ్యాలెట్’..
- మోస్ట్ పాపులర్ హీరోల లిస్ట్ లో టాప్ లో ప్రభాస్, అల్లు అర్జున్ ...