మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి విద్యుత్ పవర్ ప్లాంట్ లో ఓ కార్మికుడు ప్రమాదంలో గాయపడి చనిపోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమకు న్యాయం చేయాలంటూ ప్రమాదంలో చనిపోయిన కాంట్రాక్ట్ కార్మికుడు చంద్రమోహన్ కుటుంబ సభ్యులు పవర్ ప్లాంట్ ముందు ఆందోళన చేశారు.
ప్రమాదానికి సింగరేణి యాజమాన్యం, పవర్ మేక్ కంపెనీ బాధ్యత వహించాలన్నారు. సింగరేణి యాజమాన్యం కోటి రూపాయల పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే ఆందోళన చేస్తామన్నారు.