
- సింగరేణికి ‘కోల్’ టాస్క్
- టార్గెట్ రీచ్ కావాలంటే రోజుకు 2.27 లక్షల టన్నులు ఉత్పత్తి చేయాలి
- యంత్రాల పని గంటలు పెంచేందుకు యాజమాన్యం చర్యలు
- గనుల ఏరియాల్లో మల్టీ డిపార్ట్మెంటల్ టీమ్స్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు సింగరేణి యాజమాన్యం ఆపసోపాలు పడుతోంది. 2023–24లో 780 లక్షల టన్నులు ఉత్పత్తి చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 560.85 లక్షల టన్నుల బొగ్గును మాత్రమే ఉత్పత్తి చేసింది. టార్గెట్రీచ్అయ్యేందుకు నేటి నుంచి నెలాఖరు వరకు డెయిలీ 2.27లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని ఆఫీసర్లకు సూచించింది. యంత్రాల పని గంటలు పెంచాలని ఆదేశించింది. ఏరియాల వారీగా మల్టీ డిపార్ట్మెంటల్ టీమ్స్ఏర్పాటు చేసింది.
ఆ నాలుగు ఏరియాల్లోనే..
ఇటీవల సీఎండీగా బాధ్యతలు చేపట్టిన డైరెక్టర్ఫైనాన్స్ఎన్.బలరాంకు ఉత్పత్తి లక్ష్యాల సాధన పెద్ద టాస్క్‌గా మారింది. గతేడాది ఏప్రిల్ నుంచి జనవరి వరకు 616.07లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా, 560.85లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి చేసింది. ఎలాగైనా లక్ష్యానికి చేరుకోవాలని, అండర్ గ్రౌండ్మైన్లలో బొగ్గు ఉత్పత్తిని పెంచాలని యాజమాన్యం ప్లాన్చేస్తోంది.
ఎల్‌హెచ్‌డీ, ఎస్డీఎల్యంత్రాల పని గంటలను పెంచుతోంది. మరో వైపు ఉత్పత్తి ఖర్చును తగ్గించడమే లక్ష్యంగా యాజమాన్యం మల్టీ లెవెల్ డిపార్ట్మెంటల్టీమ్స్ ను ఏర్పాటు చేసింది. సింగరేణి పరిధిలోని12 ఏరియాలకుగానూ కొత్తగూడెం, మణుగూరు, మందమర్రి, భూపాలపల్లి ఏరియాలు లక్ష్య సాధనలో వెనుకబడ్డాయి. అత్యధికంగా అడ్రియాలలో 128 శాతం, ఆర్జీ-3 ఏరియాలో 118 శాతం, ఆర్జీ-2 ఏరియాలో 117 శాతం బొగ్గు ఉత్పత్తి చేశారు.