- సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య
గోదావరిఖని, వెలుగు : జీవన్ ప్రమాణ్ పత్రాలు ఆన్ లైన్లో అందజేసినా, సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు ఫిబ్రవరి నెల ఫించన్ ఎందుకు జమ చేయలేదని సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య ప్రశ్నించారు. మంగళవారం గోదావరిఖని సీఎంపీఎఫ్ ఆఫీస్‌లో రీజినల్ కమిషనర్ హరి పచౌరీని కలిసి వివిధ సమస్యలపై చర్చించారు. 2021 జులై 1 నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు సవరించిన ఫించన్, బకాయిలు చెల్లించాలన్నారు.
జనవరి నుంచి నిలిపేసిన ఫించన్‌ను వెంటనే బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. వితంతు పెన్షన్ దారులు సైతం ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ధన్‌బాద్‌లోని సీఎంపీఎఫ్ కమిషనర్‌కు లేఖ రాస్తామని తెలిపారు. శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి బాజీసైదా తదితరులు పాల్గొన్నారు.