- స్పష్టమైన హామీ ఇచ్చే యూనియన్‌కే ఓటు అంటున్న లేబరర్లు
- ఆ డిమాండ్లనే మేనిఫెస్టోల్లో పెడ్తున్న యూనియన్లు
కోల్‌బెల్ట్, వెలుగు : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తున్న యూనియన్లకు కార్మికుల నుంచి అనేక డిమాండ్లు ఎదురవుతున్నాయి. ఏండ్లు గడుస్తున్నా గనుల్లో పని పరిస్థితులు మారకపోవడం, ఐటీ మినహాయింపు హామీలకే పరిమితం కావడం, 25 ఏండ్లుగా పెన్షన్ పెరగకపోవడం, సొంతింటి కల నెరవేరకపోవడం వంటి సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేసే సంఘాలకే తమ ఓటు అని కార్మికులు స్పష్టం చేస్తున్నారు. ఇన్నాళ్లూ హామీలు ఇచ్చి గెలిచాక మరిచిన సంఘాల నాయకులను నిలదీస్తున్నారు. దీంతో కార్మిక సంఘాలన్నీ సింగరేణీయుల ప్రధాన డిమాండ్లను సాధిస్తామని గేట్మీటింగుల్లో ప్రతిన బూనుతున్నాయి. అవే అంశాలను తమ మేనిఫెస్టోల్లోనూ పెట్టి కార్మికులను ఓట్లు అడుగుతున్నాయి.
అరకొర పరికరాలు.. విధుల్లో ఎదురీత
సింగరేణిలో 24 అండర్ గ్రౌండ్ బొగ్గు గనులు, 18 ఓపెన్‌కాస్ట్ మైన్లు ఉన్నాయి. ఆరు జిల్లాల్లో విస్తరించిన సింగరేణిలో 39,832 మంది కార్మికులు పనిచేస్తున్నారు. బొగ్గు వెలికితీతలో రికార్డు సాధిస్తున్న కార్మికులకు సౌలత్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. బొగ్గు గనుల్లో పరికరాల కొరత తీవ్రంగా ఏర్పడింది. ఉన్నవాటితోనే సర్దుకుంటూ పనిభారం మోస్తున్నారు. మెషీన్లకు సంబంధించి స్పేర్ పార్ట్స్, డ్రిల్రాడ్, డ్రిల్ బిట్స్ వంటి పరికరాలు లేక అవస్థలు పడుతున్నారు. ఉన్నవాటిని రిపేర్లు చేసుకుంటున్నారు. ఆరు నెలలకు ఒకసారి క్వాలిటీ బూట్లు అందించాల్సి ఉన్నా ఇవ్వడం లేదు. రెయిన్ కోట్లు, స్వెటర్ల సప్లయ్ కూడాకొన్నేళ్లుగా బంద్ అయ్యింది.
ఇన్‌కమ్‌ట్యాక్స్, పెర్క్స్‌పై మినహాయింపు లేకపాయె
సింగరేణి కార్మికులు ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో ఏటా రెండు నెలల వేతనం నష్టపోతున్నారు. ట్యాక్స్ రద్దు చేయాలని ఏళ్లుగా వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కార్మికులకు చెల్లించే ప్రోత్సాహాలపై విధించే ఇన్కమ్ ట్యాక్స్‌ను సంస్థలో పనిచేస్తున్న ఆఫీసర్లకు తిరిగి చెల్లిస్తూ కార్మికుల విషయంలో వివక్ష పాటిస్తున్నారు. కోలిండియాలో 2013 జనవరి 1 నుంచే ఆఫీసర్లు, కార్మికుల పెర్స్క్‌పై చెల్లించే పన్నును యాజమాన్యం తిరిగి చెల్లిస్తొంది.
సింగరేణిలో కేవలం అధికారులకు మాత్రమే చెల్లిస్తున్నారు. కార్మికులకు అదే విధానం వర్తింపజేస్తామంటూ సంఘాలు హామీ ఇస్తున్నాయి. అలాగే ఈ దఫా ఎన్నికల్లో అన్ని సంఘాలు సొంతింటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. శిథిలావస్థకు చేరిన ఇరుకు క్వార్టర్లలో కార్మికులు నివాసం ఉంటున్నారు. క్వార్టర్లు లేనివాళ్లు సొంత ఇళ్లలో ఉంటున్నారు. ఇళ్లు నిర్మించుకోవడానికి స్థలం కేటాయించాలన్న డిమాండ్ అమలుకు నోచుకోవడంలేదు. 250 గజాల స్థలం, రూ.20 లక్షల వడ్డీలేని రుణం ఇప్పిస్తామంటూ నేతలు హామీ ఇస్తున్నారు.
స్పష్టత లేని గ్రాట్యుటీ.. 25ఏళ్లుగా పెరగని పెన్షన్
రూ.10 లక్షలు ఉన్న గ్రాట్యుటీని రూ.20 లక్షలకు పెంచి 2017 ఫిబ్రవరి నుంచి అమలు చేస్తున్నారు. అయితే 2016 జనవరి నుంచి దానిని అమలు చేయాలన్న డిమాండ్ ను జేబీసీసీ కమిటీ ఆమోదించింది. దీన్ని సింగరేణిలో అమలు చేయడంలేదు. దీంతో సుమారు 3 వేల మందికి రూ.20 లక్షల గ్రాట్యుటీ వర్తించకుండా పోయింది. బొగ్గు గని కార్మికులకు 1998లో పెన్షన్ స్కీం అమల్లోకి వచ్చింది. మూడేళ్లకోసారి రివైజ్డ్ చేయాలని ఆగ్రిమెంట్ ఉన్నా 25 ఏళ్లుగా రిటైర్డు కార్మికులకు ఒకే రకం పెన్షన్ వస్తోంది.
కొత్త బొగ్గు గనుల ఏర్పాటుకు సవాల్
సింగరేణిలో కొత్త బొగ్గు గనుల ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. బొగ్గు బ్లాక్‌లు దేశంలో ఎక్కడ ఉన్నా సుప్రీంకోర్టు సూచన మేరకు కేంద్ర సర్కార్ 2015లో తీసుకువచ్చిన మైన్స్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్(ఎంఎండీఆర్) యాక్ట్ పరిధిలో ఓపెన్ బిడ్డింగ్ ద్వారా కేటాయిస్తున్నారు. ఇప్పటికే సింగరేణికి చెందిన ఇల్లందు కోయగూడెం ఓసీపీ3, మందమర్రిలోని శ్రావణపల్లి ఓసీపీ3, కేకే5, సత్తుపల్లిలోని ఓసీపీ3 బొగ్గు బ్లాక్‌లను ఓపెన్బిడ్డింగ్లో పెట్టారు. కోయగూడెం3ని ఇప్పటికే ఆరోరా కంపెనీకి కేటాయించారు. తాడిచెర్ల బ్లాక్1లో ప్రైవేటు కంపెనీ ద్వారా బొగ్గు తీస్తున్నారు. సింగరేణి ఓపెన్ బిడ్డింగ్‌లో పాల్గొనలేదు. దీంతో కొత్త గనులను ఎలా దక్కించుకోవాలో గెలిచిన సంఘాలకు సవాల్‌గా మారనుంది.
గనుల్లో కానరాని రక్షణ చర్యలు
బొగ్గు గనుల్లో యాజమాన్యం సేఫ్టీని నిర్లక్ష్యం చేస్తోంది. ఏటా యాక్సిడెంట్లు జరిగి కార్మికుల ప్రాణాలు పోతున్నాయి. 2019 నుంచి ఇప్పటి వరకు ప్రమాదాలు జరిగి 515 మంది కార్మికులకు తీవ్రగాయాలు కాగా 43 మంది చనిపోయారు. రక్షణ కమిటీలతో ప్రమాదాలపై సమీక్షించడం తప్ప వాటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లే