సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి నేత్ర దానం

నస్పూర్, వెలుగు: శ్రీరాంపూర్ కాలనీకి చెందిన పోతునూరి సత్యనారాయణ సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి  శుక్రవారం చనిపోవడంతో.. అతని కండ్లను కుటుంబీకులు దానం చేశారు.   సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్రాలను సేకరించారు.  

ఈ కండ్లతో ఇద్దరికి చూపు వస్తుందని ఫౌండేషన్​ నిర్వాహకులు తెలిపారు. నేత్రదానానికి సహకరించిన సత్యనారాయణ కొడుకు శ్రీనివాస్, కోడలు స్నేహలతకు కృతజ్ఞతలు తెలిపారు.