కోల్‌బెల్ట్, వెలుగు: హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఈనెల 22,23, 24 న పాన్ ఇండియా మాస్టర్స్ గేమ్స్ ఆధ్వర్యంలో ఫస్ట్ ఫెడరేషన్ కప్ నేషనల్ మాస్టర్స్ గేమ్స్-2024లో సింగరేణి రిటైర్డు ఉద్యోగులు సత్తా చాటి పలు పతకాలు దక్కించుకున్నారు. తెలంగాణ తరుపున రామకృష్ణాపూర్‌కు చెందిన రిటైర్డు సింగరేణి ఉద్యోగి శఠగోపం కిష్టయ్య 85 ఏళ్లపైబడిన విభాగంలో పలు క్రీడల్లో పోటీపడ్డారు.
100 మీటర్ల రన్నింగ్, హ్యమ్మర్ త్రో, షాట్‌ఫుట్, జావెన్త్రో, డిస్కాస్త్రోలో గోల్డ్మోడల్స్ దక్కించుకున్నాడు. రిటైర్డు ఉద్యోగి మాడిపెల్లి రాజకోమురయ్య 69ఏళ్ల విభాగం 3 కి.మీ వాకింగ్‌లో రెండో స్థానంతో సిల్వర్ మెడల్ సాధించాడు.