
గోదావరిఖని, వెలుగు : సింగరేణి ఆర్జీ –1 ఏరియాలో ఒక రోజు బొగ్గు రవాణాలో రికార్డు సృష్టించారు. గురువారం భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్లో బొగ్గు రవాణా లక్ష్యం 16,500 టన్నులు కాగా 24,716 టన్నులను రవాణా చేశారు. టార్గెట్ను మించి అదనంగా 8,716 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేశారు. అలాగే రోజు వారీగా సీఎస్పీ నుంచి మూడు ర్యాక్స్ద్వారా బొగ్గు రవాణా అవుతుండగా అదనంగా మరో రెండు ర్యాక్స్ ద్వారా రవాణా చేశారు. రికార్డును సాధించడంలో కృషి చేసిన అఫీసర్లు, ఉద్యోగులు, లారీ ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్లు, సూపర్వైజర్లను ఆర్జీ –1 ఏరియా జనరల్ మేనేజర్ డి.లలిత్ కుమార్ అభినందించారు.