గోదావరిఖని, వెలుగు: చిన్నారులు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని సింగరేణి ఆర్జీ 1 ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ అన్నారు. నెల రోజులుగా వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సింగరేణి ఉద్యోగుల పిల్లలు, పరిసర ప్రభావిత ప్రాంత పిల్లలకు స్థానిక జేఎన్ స్టేడియంలో నిర్వహించిన సమ్మర్ క్యాంపు శనివారం ముగిసింది.
ఈ సందర్భంగా జీఎం చీఫ్ గెస్ట్‌గా పాల్గొని వివిధ క్రీడల్లో పాల్గొన్న చిన్నారులకు టీ షర్ట్స్ అందజేశారు. ఆయన మాట్లాడుతూ చిన్నారుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు క్యాంపు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. క్రీడలతో పిల్లలు మానసికంగా, శారీరకంగా దృఢంగా మారుతారన్నారు. కార్యక్రమంలో పర్సనల్ ఏజీఎం సీహెచ్ లక్ష్మీనారాయణ, ఎస్‌వోటు జీఎం రామ్మోహన్, కోల మల్లేశ్, బాలసుబ్రమణ్యం, రంగు శ్రీనివాస్, బంగారు సారంగపాణి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.