భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్లాంట్లకు అవార్డులు దక్కాయి. సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్వహణ, నిర్మాణం, నెట్ జీరో పాజిటివ్ కంపెనీగా తీసుకుంటున్న చర్యలకుగానూ ఐదు కేటగిరీల్లో సింగరేణికి అవార్డులు వచ్చాయి. ఈ నెల 5న హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ, ఏపీ వార్షిక సౌర అవార్డుల సమావేశంలో సింగరేణి సంస్థ ఈఅండ్‌ఎం డైరెక్టర్ సత్యనారాయణ, ఈఅండ్‌ఎం జీఎం జానకీరాం అవార్డులను అందుకున్నారు.
ఫాస్టెస్ట్డికార్బనైజింగ్ కోల్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ బెస్టీవ్ సౌర విద్యుత్ ప్లాంట్ల వేగవంతమైన అభివృద్ధికి గానూ, బిజినెస్ అండ్ లీడర్‌షిప్ ఎక్సలెన్స్, సివిల్ ఇంజనీరింగ్ టీం ఆఫ్ ది ఇయర్‌గా బెస్ట్కార్పొరేట్ నెట్ జీరో స్ట్రాటజీ అవార్డు, 5 మెగావాట్ల ఫ్లోటింగ్ సౌర ప్లాంట్ ఇంజినీరింగ్ డిజైన్ అండ్ కన్‌స్ట్రక్షన్స్ విభాగంలో ప్రాజెక్ట్ఇన్నోవేషన్ ఆఫ్ ది ఇయర్, బెస్ట్పర్ఫార్మింగ్ ప్రాజెక్ట్ఆఫ్ ది ఇయర్అవార్డులు పొందినట్లు డైరెక్టర్ సత్యనారాయణ సోమవారం తెలిపారు. .