
గోదావరిఖని, వెలుగు: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ నెల 16, 17, 18 తేదీల్లో జరిగే కోల్ఇండియా స్థాయి కబడ్డీ పోటీలకు సింగరేణి జట్టు ఎంపికైంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని (జీడీకే) 1వ గని సీనియర్ మైనింగ్ సర్దార్ మీస హరీశ్కెప్టెన్గా కోండ్ర కార్తీక్ (శ్రీరాంపూర్), ఎస్.శ్రీనివాసరెడ్డి, తోట గణేశ్, భూక్య గణేష్ (భూపాలపల్లి), ఓ.భద్రయ్య (మణుగూరు), దాసారపు గణేశ్ (కొత్తగూడెం), ఎస్.శివకృష్ణ, కందుల రమేశ్ (మందమర్రి), తోట తిరుపతి (ఆర్జీ 2), బుద్ద శ్రీనివాస్, కైలాసకోటి శ్రీనివాస్ (ఆర్జీ 1) టీమ్ పాల్గొంటుంది. సింగరేణి జట్టు కోల్ ఘన విజయం సాధించాలని సింగరేణి సీండీ ఎన్.బలరామ్, ఆర్జీ 1 ఏరియా జనరల్ మేనేజర్ డి.లలిత్ కుమార్ ఆకాంక్షిస్తూ బుధవారం బయలుదేరిన జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.