
జైపూర్, వెలుగు: జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌లో (ఎస్టీపీపీ) మూడో యూనిట్ నిర్మించే స్థలాన్ని సింగరేణి డైరెక్టర్ (ఈ అండ్ ఎం) డి.సత్యనారాయణ రావు ఎస్టీపీపీ ఇన్చార్జ్ ఈడీ కె.శ్రీనివాసులుతో కలిసి బుధవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ త్వరలో ఎస్టీపీపీలో మూడో యూనిట్ పనులు ప్రారంభం కావచ్చని, అధికారులంతా సంసిద్ధంగా ఉండాలన్నారు.
ప్లాంటులోని బాయిలర్ ఏరియాను పరిశీలించారు. పవర్ ప్రొడక్షన్లో సమస్యలు లేకుండా పనిచేసేలా చూడాలని ఆదేశించారు. వేసవి నేపథ్యంలో విద్యుత్‌కు డిమాండ్ పెరుగుతుం దని, అందుకు సరిపడా ఉత్పత్తి చేయాలన్నారు. ఎస్టీపీపీలో ఏజీఎంగా పనిచేసి రిటైరైన సుధాకర్‌ను సన్మానించారు. కార్యక్రమంలో ఓ అండ్ ఎం చీఫ్ జె.ఎన్ సింగ్, ఏజీఎం ప్రసాద్, డీజీడీఎం వేణుగోపాలరావు, సీఎంవో ఏఐ బ్రాంచ్ ప్రెసిడెంట్ ఎస్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
భారీ యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి
నస్పూర్, వెలుగు: ఓసీసీ గనిలో భారీ యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సింగరేణి డైరెక్టర్ (ఈ అండ్ ఎం) సత్యనారాయణ అన్నారు. బుధవారం శ్రీరాంపూర్‌లోని ఓసీపీని జీఎం శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు. గనిలో కోల్ ఎక్స్పోజర్ ప్రదేశాలను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. కార్పొరేట్ జీఎం(సీహెచ్‌పీ) తిరుమల్ రావు, ఎస్వోటు జీఎం సత్యనారాయణ, ఏరియా ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి, శ్రీరాంపూర్ ఓసీపీ పీవో శ్రీనివాస్, కార్పొరేట్ డీజీఎంలు కేశవరావు, రవీందర్, క్వాలిటీ ఇన్చార్జ్ వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.