ఎస్టీపీపీకి గ్రీన్ ఎన్విరో సేఫ్టీ గోల్డ్ అవార్డ్

జైపూర్, వెలుగు : సేఫ్టీ ఎక్సలెన్స్ పవర్ థర్మల్ సెక్టర్ విభాగంలో జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ గ్రీన్ ఎన్విరో సేఫ్టీ గోల్డ్ అవార్డు అందుకుంది. శనివారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఫైర్ సర్వీస్, సివిల్ డిఫెన్స్, హోం గార్డ్స్ డైరెక్టర్ జనరల్ వివేక్ వాస్తవ చేతుల మీదుగా ఎస్టీపీపీ డీజీఎం పంతుల, డీజీఎం ఈఅండ్ ఎం అవినాష్,ఎస్టీపీపీ సేఫ్టీ విభాగం పులి సురేశ్ పురస్కారాలను అందుకున్నారు. ఎస్టీపీపీకి 1వ గ్రీన్ ఎన్విరో సేఫ్టీ గోల్డ్ అవార్డు దక్కడంపై ఎస్టీపీపీ ఈడీ ఎన్వీ రాజశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయాలను సింగరేణి సీఎండీ బలరాం నాయక్, డైరెక్టర్ ఈ అండ్ ఎం ఆపరేషన్స్ సత్యనారాయణరావు ప్రశంసించారని అన్నారు.