ఎస్టీపీపీకి మరో రెండు అవార్డులు

  • సింగరేణి సీ ఎండీ, ఉద్యోగుల హర్షం  

జైపూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ మరో రెండు బెస్ట్ అవార్డులను అందుకుంది. శుక్రవారం రాత్రి జరిగిన మిషన్ ఎనర్జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోవా లో జరిగిన వాటర్ ఆప్టిమైజేషన్ అవార్డ్స్ 2025 వేడుకల్లో  ఎస్టీపీపీ కి 500 మెగావాట్ల పైన బొగ్గుతో నడిపించే  పవర్ ప్లాంట్ల కేటగిరీ లో బెస్ట్  వాటర్ ఎఫిషియెంట్ అవార్డు దక్కించుకుంది. దీంతో పాటు బెస్ట్  జీరో లిక్విడ్ డిశ్చార్జ్  ప్లాంట్ల కేటగిరీలో ‘బెస్ట్ జీరో లిక్విడ్ డిశ్చార్జ్  ప్లాంట్ ఆప్ ది ఇయర్’ అవార్డులను అందుకుంది.