సింగరేణిలో బ్లాక్ డే.. నల్ల బ్యాడ్జీలతో నిరసన

సింగరేణిలో బ్లాక్ డే.. నల్ల బ్యాడ్జీలతో నిరసన

కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ… సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక,  సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇవాళ బ్లాక్ డే నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 2వ బొగ్గు గనిపై...సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు, సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. 

అంతేకాకుండా బిల్లు పత్రాలను దగ్ధం చేశారు నాయకులు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు నేతలు. సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేయకుండా... సింగరేణి సంస్థకే అప్పగించాలని  డిమాండ్ చేశారు. అలాగే నవంబర్ 26న జరిగే దేశవ్యాప్త ఆందోళనలను కార్మిక వర్గం  విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు నేతలు.