సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పటిష్టమైన బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 5 టేబుళ్లు, ఐదు రౌండ్లలో లెక్కింపు ప్రక్రియ జరగనుంది. శ్రీరాంపూర్ డివిజన్ లో అత్యధికంగా 9 రౌండ్ల లెక్కింపు నిర్వహిస్తారు. వెయ్యి మంది ఓటర్లకు ఒక టేబుల్ చొప్పున కౌంటింగ్ జరుగుతుంది. అర్థరాత్రి తర్వాత పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రాల వద్దకు భారీగా కార్మిక సంఘాల నేతలు తరలివచ్చారు.
ఇప్పటివరకు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ సంస్థ INTUC ఇల్లెందు, మణుగూరు, కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా, రామగుండ RG -3ఏరియాలో విజయఢంకా మోగించింది. బెల్లంపల్లి, రామగుండం RG -1, RG-2 ఏరియాల్లో ఏఐటీయూసీ విజయం సాధించింది.
ఇల్లెందులో 46 ఓట్ల తేడాతో ఐఎన్ టీయూసీ విజయం సాధించింది. ఐఎన్ టీయూసీకి 310 ఓట్లు, ఏఐ టీయూసీకి 364 ఓట్లు పడ్డాయి.
బెల్లంపల్లి ఏరియాలో ఏఐటీయూసీ విజయం సాధించింది. 112 ఓట్ల మెజార్టీతో గెలిచింది. బెల్లంపల్లి ఏరియాలో మొత్తం 959 ఓట్లు పడగా హెచ్ ఎంఎస్ 61, బీఎంఎస్ 06, టీబీజీకేఎస్ 03, సీఐటీయూ 11, ఏఐటీయూసీ 497, ఐఎన్ టీయూసీకి 375 మూడు ఓట్లు తిరస్కరించనట్లు ప్రకటించారు.
భద్రాద్రి కొత్తగూడె కార్పొరేట్ ఏరియాలో ఐఎన్ టీయూసీ విజయం సాధించింది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కొత్త గూడెం కార్పొరేట్ ఎన్నికల ఫలితాలను అధికారులు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్ టీయూసీ యూనియన్ 288 ఓట్లతో విజయం సాధించింది. ఓట్ల లెక్కింపులో ఐఎన్ టీయూసీ కి 549, బీఎంఎస్ -261, ఏఐటీయూసీ-253, సీఐటీయూ-42 , టీబీజీకేఎస్-32, హెచ్ ఎంఎష్ 04 చొప్పున ఓట్లు వచ్చాయి.
మణుగూరు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల లెక్కింపులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్నికల ఫలితాల్లో ఐఎన్ టీయూసీ 2ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా రీ కౌంటింగ్ కు ఏఐటీయూసీ కోరింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఏఐటీయూసీ అభ్యర్థనను తిరస్కరించారు. ఐఎన్ టీయూసీకి 778 ఓట్లు రాగా.. ఏఐటీయూసీకి 776 ఓట్లు పడ్డాయి. టీబీజీకేఎస్ కు 728 ఓట్లు, సీఐటీయూ -40, బీఎంఎస్ -03 వచ్చాయి.
సింగరేణి రామగుండం RG 1, రామగుండం RG-2 ఏరియాలో ఏఐటీయూసీ విజయం సాధించింది. రామగుండం RG-3 ఏరియాలో ఐఎన్ టీయూసీ విజయం సాధించింది.